IND vs AUS 3rd T20I : ఆసిస్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, రఫ్పాడించిన సూర్యకుమార్ యాదవ్- విరాట్ కోహ్లీ, బౌండరీతో విన్నింగ్ షాట్ కొట్టి పాండ్యా, 2-1తో సిరీస్ భారత్ కైవసం
చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్ ను (Series Win) కూడా కైవసం చేసుకుంది.
Hyderabad, SEP 25: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో (IND vs AUS 3rd T20I ) ఆస్ట్రేలియాపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ (INDIA WIN) కొట్టింది. చివరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సిరీస్ ను (Series Win) కూడా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరగుల టార్గెట్ ను భారత్.. మరో బంతి మిగిలి ఉండగానే చేధించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52) (), టిమ్ డేవిడ్ (54) ధాటిగా ఆడటంతో ఆసీస్ జట్టు 186/7 స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు ఆడిన రోహిత్ శర్మ (17) కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav) (69), కోహ్లీ (63) (Virat Kohli) జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. సూర్య అవుటైన తర్వాత ఆసీస్ బౌలింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేయడంతో కొంత టెన్షన్ నెలకొంది.
చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి కోహ్లీ (Kohli) భారీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతికే అతను అవుటయ్యాడు. ఆ ఓవర్ ఐదో బంతి.. పాండ్యా (25 నాటౌట్) బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్లడంతో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను 2-1తో భారత్ వశం చేసుకుంది. ఆసీస్ బౌలర్లలో డానియల్ శామ్స్ 2 వికెట్లు తీసుకోగా.. జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.