Naved-Ul-Hasan on Virender Sehwag: సెహ్వాగ్‌కు బ్యాటింగ్ రాదు,మా దేశంలో అయితే గల్లీలోనే ఉండేవాడని పాక్ పేసర్ సంచలన వ్యాఖ్యలు, మూసుకోమంటూ టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌

టీమిండియా మాజీ ఓపెనర్‌, డేరింగ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ పై (Naved-Ul-Hasan on Virender Sehwag) పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Virender Sehwag and Former Pak pacer Rana Naved-Ul-Hasan (Photo-Insta)

టీమిండియా మాజీ ఓపెనర్‌, డేరింగ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ పై (Naved-Ul-Hasan on Virender Sehwag) పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ రానా నవీద్‌ ఉల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నా దృష్టిలో సెహ్వాగ్‌ను అవుట్‌ చేయడం సులువే. కానీ రాహుల్‌ ద్రవిడ్‌కు బౌలింగ్‌ చేయడం మాత్రం అత్యంత కష్టమైనది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాదిర్‌ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నవీద్‌ ఉల్‌ హసన్‌ (Rana Naved-Ul-Hasan) సెహ్వాగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.

2005 నాటి వన్డే సిరీస్‌ సంగతుల గురించి తాజాగా ప్రస్తావించిన నవీద్‌ ఉల్‌ హసన్‌.. తను పాక్‌ జట్టుకు ఆడే రోజుల్లో టీమిండియా మిగతా బ్యాటర్లందరికంటే ఈ ముల్తాన్‌ కింగ్‌నే ఈజీగా పెవిలియన్‌కు పంపవచ్చని భావించేవాడినని తెలిపాడు. వీరూతో పోలిస్తే రాహుల్‌ ద్రవిడ్‌ను ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని పేర్కొన్నాడు.

‘తొలి రెండు మ్యాచ్‌లలో సెహ్వాగ్‌ అద్భుతంగా ఆడాడు. అప్పటికి మేము ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉన్నాం. ఒక మ్యాచ్‌లో అయితే సెహ్వాగ్‌ ఏకంగా సెంచరీ కొట్టాడు. రెండో మ్యాచ్‌లో 70కి పైగా స్కోర్‌ చేశాడు.

యశస్వి రికార్డుల మోత, భారీ స్కోర్ దిశగా ఇండియా, అరంగేట్రం టెస్టులో సెంచరీ బాది అదరహో అనిపించిన జైస్వాల్‌

అప్పుడు నేను ఇంజమామ్ భాయ్‌ దగ్గరకు వెళ్లి బంతిని నాకివ్వమని అడిగాను. స్లో బౌన్సర్‌తో సెహ్వాగ్‌ను (Virender Sehwag) బోల్తా కొట్టించానని తెలిపాడు. అయితే అంతకంటే ముందు అతడిని నేను స్లెడ్జ్‌ చేశాను. సెహ్వాగ్‌ దగ్గరికి వెళ్లి.. ‘‘నీకు అసలు ఎలా ఆడాలో తెలియదు. నువ్వు ఒకవేళ పాకిస్తాన్‌లో గనుక ఉండి ఉంటే.. ఇంత ఈజీగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేవాడివి కాదు’’ అని అన్నాను.

అందుకు బదులుగా తను కూడా నన్ను ఏవో మాటలు అన్నాడు. ఆ వెంటనే నేను ఇంజీ భాయ్‌ దగ్గరికి వెళ్లి.. ‘‘తదుపరి బంతికి అతడు అవుట్‌ అవుతాడు చూడు అని చెప్పాను. నిజానికి తను అప్పుడు ఆశ్చర్యపోయాడు. అయితే, నా వ్యూహాన్ని అమలు చేస్తూ.. స్లో బాల్‌ను వేశాను. అప్పటికే కోపంగా ఉన్న సెహ్వాగ్‌ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇలా అత్యంత ముఖ్యమైన వికెట్‌ను పడగొట్టడం ద్వారా మ్యాచ్‌ గెలవడంలో నేను కీలక పాత్ర పోషించానని అన్నాడు.

నీకు ఇండియాలో మస్తు క్రేజ్ ఉంది సామే, ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎంబాపేని పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోదీ

కాగా 2005లో పాకిస్తాన్‌ ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. ఆఖరి నాలుగు వన్డేలు గెలిచి పాక్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నవీద్‌ ఉల్‌ హసన్‌ ఏకంగా నాలుగుసార్లు సెహ్వాగ్‌ను అవుట్‌ చేయడం గమనార్హం. నవీద్‌ పాక్‌ తరఫున 74 వన్డేలు ఆడి 110 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది టెస్టులు, నాలుగు టీ20లు ఆడి వరుసగా 18, 5 వికెట్లు తీశాడు. కాగా సెహ్వాగ్‌పై నవీద్‌ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. వీరూ గురించి మాట్లాడే సీన్‌ నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif