అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తొలి టెస్టులోనే శతకంతో చెలరేగిపోయాడు. ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (221 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు.రెండోరోజు ఆట ముగిసేసరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.
ప్రస్తుతం జైశ్వాల్ (350 బంతుల్లో 143 పరుగులు నాటౌట్), విరాట్ కోహ్లి(96 బంతుల్లో 36 పరుగులు నాటౌట్) క్రీజులో ఉన్నారు.అంతకముందు రోహిత్ శర్మ(221 బంతుల్లో 103 పరుగులు) చేసి ఔటయ్యాడు. ఆటకు ఇంకా మూడు రోజులు సమయం ఉండడం.. రహానే, జడేజా, ఇషాన్ కిషన్‌లు బ్యాటింగ్‌కు రావాల్సి ఉండడంతో టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశముంది.
91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్ రికార్డులకెక్కాడు. జైశ్వాల్ కంటే ముందు శ్రేయాస్ అయ్యర్ 2021లో న్యూజిలాండ్‌పై అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇక అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన నాలుగో యంగెస్ట్ భారత క్రికెటర్‌గా జైశ్వాల్(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు. ఈ జాబితాలో పృథ్వీ షా, అబ్బాస్ అలీ బేగ్, గుండప్ప విశ్వనాథ్‌లు ఉన్నారు.విదేశాల్లో అరంగేట్రం టెస్టులో సెంచరీ బాదిన ఐదో భారత క్రికెటర్ కూడా యశస్వినే..