Sunil Gavaskar joy: పాక్ పై భారత్ గెలవగానే చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్... వీడియో ఇదిగో!

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లు ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చెప్పేందుకు, మెల్బోర్న్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచే నిదర్శనం.

Gavaskar (Credits: Twitter)

Newdelhi, October 24: భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ మ్యాచ్ (Cricket Match) లు ఎలాంటి వినోదాన్ని (Entertainment) అందిస్తాయో చెప్పేందుకు, మెల్బోర్న్ (Melbourne) లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచే నిదర్శనం. ఆఖరి బంతి వరకు విజయం దోబూచులాడిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది. కాగా, భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించారు. చివర్లో అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టగానే గవాస్కర్ ఆనందం అంతాఇంతా కాదు. ఆయన చిన్నపిల్లాడిలా గంతులేశారు. టీమిండియా విజయాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. శ్రీకాంత్, ఇర్ఫాన్ పఠాన్ లతో తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది

కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, పాక్‌పై గెలుపు తర్వాత భావోద్వేగానికి గురైన విరాట్, టీమ్‌మేట్స్‌ను చూసి మోకాళ్లపై కూర్చొని ఎమోషనల్ అయిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదుగోండి!

అటు, టీమిండియా విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ లో అయితే దీపావళి ఒకరోజు ముందే వచ్చినట్టయింది. మ్యాచ్ ముగియగానే అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చుతూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.