Dean Elgar on Virat Kohli: విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు, ఆ తర్వాత మందు తాగుతూ సారీ చెప్పాడని వెల్లడి
భారత పర్యటనలో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి తనపై ఉమ్మివేసాడని (Virat Kohli Spat on Me) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్ ఎల్గర్ షాకింగ్ సంఘటనను పంచుకున్నాడు.
Virat Kohli Spat on Me: 2015లో ప్రొటీస్.. భారత పర్యటనలో మొహాలీలో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి తనపై ఉమ్మివేసాడని (Virat Kohli Spat on Me) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్ ఎల్గర్ షాకింగ్ సంఘటనను పంచుకున్నాడు.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గార్ బాంటర్ విత్ బాయ్స్' అనే పోడ్ కాస్ట్ లో ఈ సంచలన విషయాలు (Dean Elgar on Virat Kohli) వెల్లడించాడు.
అప్పుడు ఎల్గర్ భారతదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టూరింగ్ పార్టీలో భాగమయ్యాడు, ప్రొటీస్ 0-3తో ఓడిపోయింది, రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజాల స్పిన్ కవలలకు ధన్యవాదాలు. ఎడమచేతి వాటం ఆటగాడు 4 మ్యాచ్‌ల్లో 19.57 సగటుతో 137 పరుగులు చేయడం మర్చిపోలేని సమయం.
ఎల్గర్ మాట్లాడుతూ..అది భారత్ లో నా తొలి పర్యటన. మొహాలీ వేదికగా ఓ టెస్టులో నేను బ్యాటింగ్ కు దిగాను. కోహ్లీని ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. అక్కడి పిచ్ చూస్తే ఓ జోక్ లా అనిపించింది. అలాంటి పిచ్ పై బ్యాటింగ్ ఓ సవాలుగా నిలిచింది. బ్యాటింగ్ చేస్తున్న నాపై అశ్విన్, జడేజా మాటలు తూటాలు విసురుతున్నారు. నేను కూడా వారికి దీటుగా జవాబు చెబుతున్నాను.
కానీ కోహ్లీ మధ్యలో వచ్చి నాపై ఉమ్మేశాడు. దాంతో నేను ఓ బూతు మాట ఉపయోగించి, బ్యాట్ తో కొడతానంటూ కోహ్లీని హెచ్చరించాను. అప్పటికి కోహ్లీ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. ఆ జట్టులోనే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. అందువల్ల దక్షిణాఫ్రికా యాస గురించి, నేను వాడిన బూతు మాట గురించి కోహ్లీకి అవగాహన ఉంటుందనే అనుకున్నాను.
నేనా ఆ మాట అనగానే కోహ్లీ కూడా అదే బూతు మాటను ఉచ్ఛరిస్తూ నన్ను హేళన చేయడం మొదలుపెట్టాడు. దాంతో... వీడితో పెట్టుకోవడం అనవసరం అనిపించింది. ఆ తర్వాత 2017-18 సీజన్ లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. కోహ్లీ నా వద్దకు వచ్చి... నేను చెప్పేది విను... ఈ సిరీస్ ముగిసిన తర్వాత మనిద్దరం కలిసి డ్రింక్ చేద్దామా? నేను ప్రవర్తించిన తీరు పట్ల క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. కోహ్లీ ప్రతిపాదనకు నేను అంగీకరించాను. ఆ సిరీస్ అయిపోగానే ఇద్దరం పార్టీ చేసుకున్నాం. వేకువజామున 3 గంటల వరకు మేమిద్దరం తాగుతూనే ఉన్నాం" అంటూ ఎల్గార్ వివరించాడు.
ఇటీవల ఎల్గార్ కెరీర్ లో చివరి టెస్టు ఆడింది టీమిండియా పైనే. ఎల్గార్ చివరి ఇన్నింగ్స్ ఆడగానే కోహ్లీ అతడిని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.