ఇంటర్నేషనల్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం అబుదాబి వేదికగా ఎంఐ ఎమిరేట్స్‌, అబుదాబి నైట్ రైడర్స్‌ మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ అద్బుతమైన క్యాచ్‌తో మెరిశాడు. అబుదాబి ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన ఫజల్హాక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఎవాన్స్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో లాంగ్‌ ఆఫ్‌లో ఉన్న బౌల్ట్‌ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ఎవాన్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. బౌల్ట్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్‌ విజయం సాధించింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)