Ben Duckett Dismissal Video (Photo/BCCI)

టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఎప్పుడూ కూల్​ గా ఉంటాడనేది తెలిసిందే. అయితే ఇంగ్లండ్​తో​ జరుగుతున్న తొలి టెస్ట్​లో బుమ్రా కీపర్ కేఎస్ భరతపై కోపాన్ని ప్రత్యర్థి జట్టు బ్యాటర్ మీద చూపించాడు.బుమ్రా కోపానికి బెన్ డకెట్ (47) బలయ్యాడు. అప్పటికే వరుస బౌండరీలతో భారత్​ ను భయపెట్టిన డకెట్ ను ఓ అద్భుతమైన ఇన్​స్వింగర్​తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు బుమ్రా. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు.

దీంతో రివ్యూకు వెళ్దామని బుమ్రా అనుకున్నాడు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ కీపర్ కేఎస్ భరత్ వైపు చూశాడు. ఎల్బీడబ్ల్యూనా? కాదా? రివ్యూకు వెళ్దామా అని అతడ్ని అడిగాడు. అయితే డీఆర్ఎస్ వద్దని భరత్ చెప్పడంతో హిట్​మ్యాన్ ఆగిపోయాడు. కానీ రీప్లేలో డకెట్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు తేలింది. దీంతో బుమ్రా కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కానీ తన అగ్రెషన్​ను భరత్ మీద కాకుండా డకెట్ మీద చూపించాడు. ఆ ఓవర్​లో మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసిన పేసుగుర్రం ఈసారి ఇంగ్లండ్ బ్యాటర్​ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫోర్త్ స్టంప్ మీద పడిన బంతి ఇన్ స్వింగ్ అయి డకెట్ ఆఫ్ వికెట్​ను గిరాటేసింది. బుమ్రా వేసిన స్పీడ్​కు వికెట్ ఎగిరి చాలా దూరంగా పడింది.

Here's Video