Samuels Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు శామ్యూల్స్‌ గుడ్‌బై, ఐసీసీ రెండు ఫైనల్స్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్

విండీస్‌ సీనియర్‌ క్రికెటర్‌ మార్లన్‌ శామ్యూల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ (Samuels Announces Aetirement) ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్‌ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శామ్యూల్స్‌ విండీస్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు.

During his match-winning knock, Samuels hit six fours and four sixes. (Photo: @westindies/Twitter)

విండీస్‌ సీనియర్‌ క్రికెటర్‌ మార్లన్‌ శామ్యూల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ (Samuels Announces Aetirement) ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్‌ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శామ్యూల్స్‌ విండీస్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) రెండు ఫైనల్స్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాలు నెగ్గిన ఏకైక క్రికెటర్ మార్లోన్‌ శామ్యూల్స్‌.

2018 డిసెంబర్‌లో శామ్యూల్స్‌ చివరిసారి వెస్టిండీస్‌ తరఫున (బంగ్లాదేశ్‌పై) అంతర్జాతీయ వన్డేలో బరిలోకి దిగాడు. 2000లో క్రికెట్‌లో అడుగుపెట్టిన శామ్యూల్స్‌ (Marlon Samuels) ప్రపంచ వ్యాప్తంగా పలు టి20 లీగ్‌లలో పాల్గొన్నాడు. కొలంబోలో జరిగిన 2012 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై (56 బంతుల్లో 78; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు)... కోల్‌కతాలో జరిగిన 2016 టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై (66 బంతుల్లో 85 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) శామ్యూల్స్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ప్లే-ఆఫ్స్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం, టోర్నీ నుంచి కేకేఆర్ ఔట్, రేపట్నించి ప్లేఆఫ్ మ్యాచ్‌లు షురూ

అతని ప్రదర్శనతోనే విండీస్‌ రెండుసార్లు టి20 వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ రెండు ఫైనల్స్‌లో శామ్యూల్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాలు కూడా లభించాయి. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌తో కలిసి శామ్యూల్స్‌ రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించడం ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది. కాగా 2018 డిసెంబర్‌ తర్వాత శామ్యూల్స్‌ విండీస్‌ తరపున ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు.

శామ్యూల్స్‌ కెరీర్‌లో వివాదాలూ ఉన్నాయి. 2008లో బుకీల నుంచి శామ్యూల్స్‌ డబ్బులు తీసుకున్నట్లు రుజువు కావడంతో అతనిపై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. 2015లో అతని బౌలింగ్‌ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఏడాదిపాటు బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించారు. ఈ మధ్యనే ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ భార్యపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి షేన్‌ వార్న్‌ ఆగ్రహానికి గురయ్యాడు. అంతకముందు కూడా 2012లో బిగ్‌బాష్‌ లీగ్‌ సందర్భంగా వార్న్‌, శామ్యూల్స్‌ మధ్య పెద్ద గొడవే చోటుచేసుకుంది.

ఓవరాల్‌గా తన కెరీర్‌లో శామ్యూల్స్‌ 71 టెస్టులు ఆడి 3,917 పరుగులు (7 సెంచరీలు; 24 అర్ధ సెంచరీలు)... 207 వన్డేలు ఆడి 5,606 పరుగులు (10 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు)... 67 టి20లు ఆడి 1,611 పరుగులు (10 అర్ధ సెంచరీలు) చేశాడు. టెస్టుల్లో 41 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టి20ల్లో 22 వికెట్లు కూడా తీశాడు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు

Varun Aaron Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన

APSRTC: సంక్రాంతి పండుగ రద్దీ, 7,200 అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ, ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడి

Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..

Share Now