IND vs NZ, World Cup 2023: మొహమ్మద్ షమీ దెబ్బకి రాహుల్‌, జడేజాల ఏడు క్యాచ్‌లు ప్రదర్శన తెర వెనక్కి, నిజానికి టీమిండియాను ఫైనల్‌కు చేర్చింది వాళ్లిద్దరే..

మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన 7 క్యాచ్‌లు పట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చారు.

KL Rahul and Ravindra Jadeja took seven catches that made India to win

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ 2023 తొలి సెమీఫైనల్లో మొహమ్మద్ షమీ ప్రదర్శన ముందు ఇద్దరు గ్రేట్ హీరోల ప్రదర్శన తెర వెనక్కి వెళ్లింది.వాళ్లిద్దరూ వికెట్‌కీపర్‌ కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా. మైదానంలో పాదరసంలా కదిలి అద్భుతమైన 7 క్యాచ్‌లు పట్టుకుని భారత్ ను ఫైనల్ కు చేర్చారు. రవీంద్ర జడేజా అయితే మైదానం నలుమూలలా తిరిగి చివర్లో క్యాచ్‌లు అందున్నాడు. రాహుల్‌ వికెట్ల వెనక అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌లు పట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో వీరికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని కొందరు అభిమానులు భావిస్తున్నారు. భారత గెలుపులో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షమీ (9.5-0-57-7) పాత్ర ఎంత కీలకమో రాహుల్‌ ,జడ్డూ భాయ్ పాత్ర కూడా అంతే కీలకమని అభిప్రాయపడుతున్నారు.

అప్పుడు విలియమ్స్, ఇప్పుడు కోహ్లీ, స్నేహితులిద్దరూ గుండెలకు హత్తుకుని ఓదార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేసిన ఐసీసీ

షమీ డ్రాప్‌ క్యాచ్‌ (విలియమ్సన్‌) మినహాయించి, మ్యాచ్‌ మొత్తం టీమిండియా ఫీల్డర్లు మైదానంలో చిరుతల్లా కదిలారని కితాబునిస్తున్నారు.నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి, నాలుగో సారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన సంగతి విదితమే.