Cricketer Honey trap: హనీ ట్రాప్ లో చిక్కుకున్న యువ క్రికెటర్.. జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లిన ఢిల్లీ క్రికెటర్ వైభవ్ కందపాల్.. డేటింగ్ సైట్ లో కొందరు వ్యక్తులు పరిచయం.. అందమైన అమ్మాయిల పేరిట క్రికెటర్ కు ఎర.. అభ్యంతరకర వీడియోల పేరిట బ్లాక్ మెయిలింగ్

వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లాడు. ఓ డేటింగ్ సైట్ ద్వారా కొందరు వ్యక్తులు వైభవ్ తో పరిచయం పెంచుకుని, అమ్మాయిల పేరిట ఎరవేశారు.

Representational (Credits: Google)

Newdelhi, Nov 8: ఢిల్లీ (Delhi) యువ క్రికెటర్ (Cricketer) వైభవ్ కందపాల్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 (T20) టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా (Kolkata) వెళ్లాడు. ఓ డేటింగ్ (Dating) సైట్ ద్వారా కొందరు వ్యక్తులు వైభవ్ తో పరిచయం పెంచుకుని, అమ్మాయిల పేరిట ఎరవేశారు. అతడిని హోటల్ నుంచి బయటికి పిలిచి, ఓ బస్టాండ్ వద్ద అతడికి కొంతమంది అమ్మాయిల ఫొటోలు చూపించారు. ఆపై ఆ క్రికెటర్ వీడియోలను చిత్రీకరించిన ఆ వ్యక్తులు బెదిరింపులకు దిగారు. తమకు డబ్బు ఇవ్వకపోతే వీడియోలు విడుదల చేస్తామని బెదిరించారు. దాంతో హడలిపోయిన ఆ యువ క్రికెటర్ వారికి రూ.60 వేలు నగదు సమర్పించుకున్నాడు. అంతేకాదు, తన బంగారు నగలు, మొబైల్ ఫోన్ కూడా ఇచ్చేశాడు.

ఇది ఒక పరిపూర్ణ ప్రయాణం, వీడ్కోలు సభలో భావోద్వేగానికి గురైన సీజేఐ యుయు లలిత్, తదుపరి సీజేఐగా జస్టిస్ DY చంద్రచూడ్

అయినప్పటికీ వారు బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో వైభవ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిషబ్ చంద్ర, శుభంకర్ బిస్వాస్, శివసింగ్ లను అరెస్ట్ చేశారు. ఈ హనీ ట్రాప్ ముఠాలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు.