Intercontinental Cup: వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా భారత జట్టు, ఇంటర్‌కాంటినెంటర్ కప్ చాంపియన్‌గా అవతరించిన భారత్, నాలుగు సీజన్లలో మూడు భారత సొంతం
రెండోసారి నాలుగు దేశాల ఇంటర్‌కాంటినెంటల్ కప్(Intercontinental Cup) చాంపియన్‌గా అవతరించింది. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియం(Kalinga Stadium)లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లెబనాన్(Lebanon)పై 2-0తో గెలుపొందింది.
New Delhi, June 18: భారత ఫుట్‌బాల్ జట్టు సంచలనం సృష్టించింది. రెండోసారి నాలుగు దేశాల ఇంటర్‌కాంటినెంటల్ కప్(Intercontinental Cup) చాంపియన్‌గా అవతరించింది. భువనేశ్వర్‌లోని కలింగ స్టేడియం(Kalinga Stadium)లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో లెబనాన్(Lebanon)పై 2-0తో గెలుపొందింది. స్టార్ ఆటగాడు సునీల్ ఛైత్రీ(Sunil Chhetri) 46వ నిమిషంలో జట్టుకు తొలి గోల్ అందించాడు. 66వ నిమిషంలో లల్లియంజుల ఛాంగ్టే(Lallianzuala Chhangte) రెండో గోల్ సాధించాడు. దాంతో, భారత ఆటగాళ్లు గెలుపు సంబురాలు చేసుకున్నారు. ఇరుజట్లు ఇంతకుముందు తలపడిన మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తొలి అర్ధభాగంలో ఇరుజట్ల ఆటగాళ్లు ఒక్క గోల్ చేయలేదు. రెండో అర్ధ భాగం మొదలైన కాసేపటికే కెప్టెన్ ఛైత్రీ గోల్ కొట్టడంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. లల్లియంజుల మరో గోల్ సాధించడంతో టీమిండియా విజయం ఖరారైంది.
ఇంటర్‌కాంటినెంటల్ కప్ ఆరంభ సీజన్ 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో కెన్యాను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే.. 2019లో మాత్రం 4వ స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో, ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఆడింది. ఆనుకున్నట్టుగానే ట్రోఫీని దక్కించుకుంది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య(All India Football Federation) నాలుగు దేశాల మధ్య ఈ టోర్నీని నిర్వహిస్తోంది. ఇందులో భారత్, లెబనాన్, మంగోలియా, వనౌతు దేశాలు పాల్గొంటున్నాయి.