Cricket in Olympics from 2028: 2028 ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్, ఆమోదం తెలిపిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
Cricket's Inclusion In 2028 Los Angeles Games: 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఐఓసీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చేర్చాలన్న నిర్వాహకుల ప్రతిపాదనకు కమిటీ అంగీకారం తెలిపినట్లు ఏఓసీ అధ్యక్షుడు థామస్ బాష్ ప్రకటించారు. 2028 ఒలింపిక్స్‌లో కొత్తగా చేర్చనున్న ఐదు క్రీడాంశాల్లో కూడా క్రికెట్ కూడా ఉందని వెల్లడించారు.
రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం విధించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, తక్షణమే నిషేధం అమల్లోకి..
ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్(నాన్- కాంటాక్ట్ అమెరికన్ ఫుట్‌బాల్), స్క్వాష్, లాక్రోస్‌లతో పాటు క్రికెట్ కూడా చేర్చనున్నారు.అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో ఐఓసీ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది.