India Gets Gold In Archery: ఏషియన్ గేమ్స్‌లో అదరగొట్టిన భారత ఆర్చర్లు, పసిడి పతకాన్ని సాధించిన జ్యోతి-ఓజాస్‌ జంట, అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్న ఇండియన్ అథ్లెట్లు

తాజాగా ఆర్చరీలో అథ్లెట్లు జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam), ఓజాస్ లు (Ojas) గోల్డ్ సాధించారు (India Gets Gold In 𝗔rchery). దీంతో భారత్ ఇప్పటి వరకు సాధించిన బంగారు పతకాల సంఖ్య 16కు చేరింది.

India Gets Gold In Archery (PIC@ SAI X)

Hangzhou, OCT 04: ఏషియన్ గేమ్స్‌ లో (Asian Games ) భారత్ కు పతకాల పంట కొనసాగుతోంది. తాజాగా ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అథ్లెట్లు జ్యోతి సురేఖ (Jyothi Surekha Vennam), ఓజాస్ లు (Ojas) గోల్డ్ సాధించారు (India Gets Gold In 𝗔rchery). దీంతో భారత్ ఇప్పటి వరకు సాధించిన బంగారు పతకాల సంఖ్య 16కు చేరింది. ఫైనల్స్ లో సౌత్ కొరియాకు చెందిన కాంపౌండ్ మిక్స్‌ డ్ టీమ్ ను సురేఖ- ఓజాస్‌ జంట ఓడించింది. ఆర్చరీలో సాధించిన గోల్డ్ మెడల్‌ తో (India Gets Gold In 𝗔rchery) ఏషియన్ గేమ్స్ లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 71కి చేరాయి.

 

ఇప్పటి వరకు ఆసియన్ గేమ్స్ లో భారత్ కు ఇదే అత్యుత్తమ పతకాల సంఖ్య కావడం విశేషం. అంతకుముందు 35 కిలో మీటర్ల వాక్ రేస్ లో భారత్ కు కాంస్యం వచ్చింది. మరోవైపు ఇవాళ జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా, 75 కేజీల బాక్సింగ్ విభాగంలో లవ్లీనా ఫైనల్స్ లో పాల్గొననుంది.