Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు.

Neeraj Chopra (Credits: X)

Newdelhi, Aug 9: భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) రికార్డు సృష్టించారు. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించి చరిత్ర తిరగరాశారు. పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024)లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌ లో నీరజ్ రజతాన్ని సాధించారు. సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచారు. పాకిస్థాన్‌ కు చెందిన అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్‌ లో స్వర్ణం గెలిచారు. కాగా పారిస్ ఒలింపిక్స్‌ లో రజతం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా తన పేరుని చిరస్థాయిగా  నిలిచిపోయేలా చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ అథ్లెట్‌ గా నీరజ్ రికార్డు సృష్టించారు.

‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

ప్రధాని మోదీ ప్రశంసలు..

పారిస్ ఒలింపిక్స్‌ లో రజతం సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. చోప్రా అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. చోప్రా ప్రతిభపై భారత్ హర్షం వ్యక్తం చేస్తోందని ఎక్స్ వేదికగా అన్నారు.

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

జావెలిన్ త్రోలో నీరజ్ రికార్డులు ఇవి..

ఒలింపిక్స్

ప్రపంచ ఛాంపియన్‌ షిప్

డైమండ్ లీగ్

ఆసియా గేమ్స్

కామన్వెల్త్ గేమ్స్



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif