Vinesh Phogat Disqualified: 100 గ్రాముల బరువు ఎక్కువుంటే ఆడనివ్వరా, అసలు ఒలింపిక్ రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి? వినేశ్ పోగట్ అనర్హత వేటు వెనుక ఏం జరిగింది..
ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. మన వినేశ్ ఈ 50 కిలోల కేటగిరిలో పోటీ పడుతోంది. అయితే ప్రిలిమినరీ రౌండ్ రోజున ఆమె .. వెయిట్ లిమిట్ సరిగానే ఉన్నది
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అనుకోని షాక్ తగిలింది. రెజ్లర్ వినేశ్ పోగట్ పై ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత వేటు పడింది.దీంతో ఫైనల్ మ్యాచ్‌కు దూరమైంది. అధిక బరువు వల్ల వినేశ్ చరిత్రను సృష్టించే అవకాశాన్ని చేజార్చుకున్నది. రెజ్లింగ్‌లో రెండు రోజులు వరుసగా బరువును చెక్ చేస్తారు. ప్రిలిమినరీ రౌండ్స్ రోజుతో పాటు ఫైనల్స్ జరిగే రోజు ఉదయం కూడా వెయిట్‌ను చెక్ చేస్తారు. ఇంతకీ రెజ్లింగ్‌లో వెయిట్ రూల్స్(Wrestling Weight Rules) ఏం చెబుతున్నాయి.
ఒలింపిక్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో పురుషుల్లో 57-125 కిలోల బరువు మధ్య ఆరు కేటగిరీలు ఉన్నాయి. ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. మన వినేశ్ ఈ 50 కిలోల కేటగిరిలో పోటీ పడుతోంది. అయితే ప్రిలిమినరీ రౌండ్ రోజున ఆమె .. వెయిట్ లిమిట్ సరిగానే ఉన్నది. మంగళవారం జరిపిన బరువు కొలతలో ఆమె సక్సెస్ అయ్యింది. పార్లమెంట్‌లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు ప్రకంపనలు, ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టిన ఎంపీలు, వీడియో ఇదిగో..
కానీ ఆ రోజు వరుసగా మూడు బౌట్స్ ఆడిందామె. ఇక రోజంతా ఆమె కొంత ఆహారాన్ని తీసుకున్నది. దీంతో వినేశ్ బరువు పెరిగినట్లు అంచనా వేశారు. రాత్రికి రాత్రే ఆమె రెండు కిలోల బరువు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. వెయిట్ రూల్‌ను అందుకోవాలంటే ఆమె శ్రమించక తప్పలేదు. ఇక కోచ్, ఇతర స్టాఫ్ ఆమెతో పాటు రాత్రంతా నిద్రాహారాలు మానేసి వినేశ్ అదనపు బరువు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆమె రాత్రికి జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలావరకు నియంత్రిచుకొన్నా.. చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది.
చివరికి ఆమె శరీరం నుంచి కొంత రక్తాన్ని తొలగించారు. అలాగే జుట్టు కూడా కత్తిరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈవెంట్‌కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. గెలిచినా ఓడినా పతకమే, వినేశ్ అనర్హత వేటు వెనుక అసలేం జరిగింది, మరిన్ని వివరాలు చెప్పేందుకు నిరాకరించిన ఐఓఏ
క్రీడాకారులను బరువు తూచే సమయంలో వారికి 30 నిమిషాల వ్యవధి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు. ఈ క్రమంలో వారు ధరించే జెర్సీలతో బరువు తూస్తారు. దీంతోపాటు వారికి ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి అంటువ్యాధులు లేవని నిర్ధరిస్తారు. ఆటగాళ్ల గోళ్లు కత్తిరించుకొన్నారో, లేదో పరిశీలిస్తారు. ఇక రెండో రోజు కూడా పోటీపడే వారికి బరువు కొలతలకు 15 నిమిషాలే కేటాయిస్తారు.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్ బుక్ లోని ఆర్టికల్ 11 ప్రకారం.. ఒకవేళ ఎవరైనా అథ్లెట్.. తొలి రోజుతో పాటు రెండో రోజు కూడా ఒకే రకమైన వెయిట్‌ను చూపించలేని క్షణంలో.. ఆ అథ్లెట్‌ను కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్‌కు చివరి ర్యాంక్‌ను కేటాయిస్తారు. అయితే బరువు విషయంలో వినేశ్ విఫలమైంది. దీంతో ఆమెను పోటీ నుంచి అనర్హురాలిగా ప్రకటించారు. కనీసం సిల్వర్ మెడల్ గెలిచే అవకాశాన్ని కూడా ఆమె కోల్పోయింది. 50 కేజీల విభాగంలో ఇప్పుడు గోల్డ్ మెడల్‌ను ఒకరికి అందజేస్తారు. ఇద్దరికి కాంస్య పతకాలను ఇస్తారు.
వినేశ్ అనర్హతపై ప్రధాని మోదీ భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) చీఫ్ పీటీ ఉషతో ఫోన్ ద్వారా మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్ లో అసలేం జరిగింది? అంటూ పీటీ ఉషను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వినేశ్ ఫోగాట్ అనర్హతకు దారితీసిన అంశాలను పీటీ ఉష ప్రధానికి వివరించారు. వినేశ్ కు మనం ఏమైనా సాయపడగలమా? ఏమైనా మార్గాలు ఉన్నాయా? అని ప్రధాని అడిగారు. ఒకవేళ వినేశ్ కు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే, ఒలింపిక్స్ లో గట్టిగా నిరసన తెలపండి అంటూ పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించారు. వినేశ్ కు తమ పూర్తి మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. ఫొగాట్ అనర్హత వేటుపై భారత్ అప్పీల్‌కు వెళ్ళిది. అమెపై అనర్హత వేటు పడటంతో ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లుగా తెలుస్తోంది.