Sania Mirza Retirement: టెన్నిస్‌ కు సానియా మీర్జా గుడ్ బై, ఆ రెండు ట్రోఫీల తర్వాత రిటైర్మెంట్ అంటూ ప్రకటన

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (Australian Open), ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ (Dubai Open) తర్వాత టెన్నిస్‌కు (Tennis) వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది.

Sania Mirza (Phoot credit: Twitter)

Hyderabad, JAN 13: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా రిటైర్మెంట్‌ (Sania Mirza Retirement) ప్రకటించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు చేరుకున్న సానియా ఆస్ట్రేలియాకు చేరుకుంది. ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ (Australian Open), ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్‌ (Dubai Open) తర్వాత టెన్నిస్‌కు (Tennis) వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది. 30 సంవత్సరాల కిందట హైదరాబాద్‌లో తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్‌ కోర్టుకు వెళ్లానని, అక్కడ కోచ్‌ టెన్నిస్‌ ఎలా ఆడాలో వివరించిందినట్లు గుర్తు చేసుకుంది. ఆరేళ్ల వయసు నుంచే నా కలలను సాకారం చేసుకునేందుకు పోరాటం మొదలైందన్న సానియా.. అన్ని సమయాల్లో తల్లిదండ్రులు, కుటుంబం, కోచ్‌, ఫిజియో, మొత్తం టీం మద్దతు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని పేర్కొంది.

ప్రతి ఒక్కరితో కన్నీళ్లు, బాధ, సంతోషం పంచుకున్నానన్న సానియా.. అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఈ చిన్నారికి కలలు కనే ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆ కలలను సాధించడంలో సహాయం చేశారంటూ ధన్యవాదాలు తెలిపింది. సానియా తన కెరీర్‌లో 36 సంవత్సరాల వయసులో ఈ నెలలో జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన అనా డానిలినాతో కలిసి గ్రాండ్‌స్లామ్‌లో ఆడనుంది. మోచేయి గాయం కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైన విషయం తెలిసిందే.

IND vs SL 2nd ODI: మరో మ్యాచ్ మిగిలుండగానే సీరిస్ కైవసం చేసుకున్న భారత్, రెండో వన్డేలో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం, అదరగొట్టిన కెఎల్ రాహుల్, మెరిసిన హార్థిక్ పాండ్యా  

ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో గతేడాదే రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. గాయం కారణం ఆస్ట్రేలియన్‌ ఓపైన్‌ నుంచి వైదలొగడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. సానియా కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించింది. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణి నిలిచింది. అంతకు ముందు సింగిల్స్‌నూ సత్తాచాటింది. వరల్డ్‌ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. 2005లో యూఎస్‌ ఓపెన్స్‌లో నాల్గో రౌండ్‌కు చేరింది.



సంబంధిత వార్తలు