Hockey Player Rajini Meet CM YS Jagan: ఏపీ హాకీ క్రీడాకారిణి రజనీకి రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత మహిళా హాకీ ప్లేయర్

ఏపీకి చెందిన ఇ.రజనీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా (Hockey Player Rajini Met CM YS Jagan) కలిశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ హాకీ ప్లేయర్ రజనీకి (Etimarupu Rajini) పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Hockey Player Rajini Meet CM YS Jagan (Photo-Twitter)

Amaravati, August 11: టోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన భారత మహిళల జట్టు హాకీ క్రీడాకారిణి.. ఏపీకి చెందిన ఇ.రజనీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా (Hockey Player Rajini Met CM YS Jagan) కలిశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ హాకీ ప్లేయర్ రజనీకి (Etimarupu Rajini) పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

క్యాంపు కార్యాలయంలో తల్లిదండ్రులతో కలిసి రజనీ సీఎం జగన్‌ను కలిశారు. రజనీని ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి అనంతరం ఆమెకు జ్ఞాపికను బహూకరించారు. గత ప్రభుత్వంలో రజనీకి ప్రకటించి.. పెండింగ్‌లో ఉంచిన బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తిరుపతిలో 1000 గజాల నివాస స్ధలం, నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రజనీ స్వగ్రామం చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒలంపిక్స్‌ హకీలో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌తో పాటు టోక్యో ఒలంపిక్స్‌ 2020లో పాల్గొన్న క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. భారత్‌ తరపున 110 అంతర్జాతీయ హకీ మ్యాచ్‌లలో పాల్గొన్న రజనీ గోల్‌ కీపర్‌గా మంచి ప్రతిభ కనపరిచింది. టోక్యో ఒలిపింక్స్‌లో కాంస్య పతక పోరులో మహిళల హాకీ జట్టు ఓటమి పాలైనప్పటికి భారత అభిమానుల మనసులు మాత్రం గెలుచుకున్నారు.

హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి, చేజారిన కాంస్య పతకం; మరో మ్యాచ్‌లో భారత రెజ్లర్ సీమా బిస్లా ఓటమి, ఈరోజు టోక్యో ఒలంపిక్స్ క్రీడా విశేషాలు ఇలా ఉన్నాయి

ఈ కార్యక్రమంలో రజనీ కుటుంబ సభ్యులు, పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ అధికారులు రామకృష్ణ, జూన్‌ గ్యాలట్, రాజశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.