Ancient Tree Fallen in AP: నేలకొరిగిన 150 ఏళ్ల సినీ 'వృక్షం'.. 300 సినిమాల షూటింగ్స్ ఇక్కడే జరిగాయి మరీ.. చెట్టుతో ఉన్న అనుబంధాన్ని స్థానికులు ఎలా నెమరువేసుకున్నారంటే? (వీడియోతో)
అవి మూగ ప్రాణులైనా.. కట్టడాలైనా.. వృక్షాలైనా.. అంతేకదా! ఇప్పుడు అలాంటి వృక్షం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.
Vijayawada, Aug 6: కొన్నింటితో పెనవేసుకున్న అనుబంధం, జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు. అవి మూగ ప్రాణులైనా.. కట్టడాలైనా.. వృక్షాలైనా.. అంతేకదా! ఇప్పుడు అలాంటి వృక్షం గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని వందల ఏళ్ల నుంచి పటిష్ఠంగా చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన ఓ నిద్రగన్నేరు చెట్టు తాజాగా నేలకొరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి (Godavari River) ఒడ్డున దాదాపు 150 ఏళ్ల కాలం నాటి ఈ భారీ వృక్షం (Ancient Tree Fallen in AP) గాలి వానలను తాళలేక ఇలా తనువు చాలించింది. ఈ చెట్టు నీడన దాదాపుగా 300 సినిమాల్లోని సీన్స్, సాంగ్స్ షూట్ చేశారు. ముఖ్యంగా దర్శకులు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలు తమ కెరీర్లోని అత్యద్భుత సినిమాలను ఇక చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రహీరోల సినిమాల్లోని కొన్ని సీన్స్ ఇక్కడే షూట్ చేశారు.
అలా నేలకొరిగింది
ఏటా వరదలకు నది గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలిపోయిందని.. తాజాగా వచ్చిన గాలివానకు మొదలు నిలబడలేక ఈ వృక్షం నేలకొరిగిందని స్థానికులు తెలిపారు. చెట్టుతో తమకు ఉన్న జ్ఞాపకాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. పై వీడియో మీరూ చూడండి.
చంపాపేట దగ్గర నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబు హల్చల్.. వీడియో వైరల్