Newdelhi, Aug 6: యువకుల నిరసనలతో బంగ్లాదేశ్ (Bangladesh) లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్ హసీనా (Suitcase of Sheikh Hasina) రాజీనామా చేసి సోదరితో కలిసి భారత్ కు వచ్చారు. ఇక, హసీనా రాజీనామా విషయం తెలుసుకొని నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని నివాసం గణ భవన్ లోకి చొరబడి ఫర్నీచర్ ను, ఇతర సామాగ్రిని లూటీ చేశారు. హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని సైతం నిరసనకారులు బద్దలు కొట్టారు. హసీనా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు.
#Bangladesh: What’s in the bag?
It has sarees of Sheikh Hasina, will make my wife Prime Minister. pic.twitter.com/Q4oYqweiMS
— Pooja Mehta (@pooja_news) August 5, 2024
బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో నుండి కుర్చీలు, సోఫాలు, దిండ్లు, గిన్నెలు ఎత్తుకెళ్లిన ఆందోళనకారులు pic.twitter.com/oI4ds88dEC
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024
అలా లాజిక్ చెప్పాడు
దుండగుల్లో ఒకడి కన్ను హసీనా దుస్తులు ఉన్న సూట్ కేసుపై పడింది. దీంతో అతను దాన్ని ఎత్తుకొని కాళ్లకు పని చెప్పాడు. పరిగెడుతున్న అతన్ని ఏం తీసుకువెళ్తున్నావ్? అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దానికి ఆ చోరుడు స్పందిస్తూ.. ‘నాకు ప్రధాని షేక్ హసీనా చీరలు దొరికాయి.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..!’ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.