Tiger Cubs Searching for Mother: రెండు రోజులైనా కానరాని జాడ, తల్లి పులి కోసం విలవిల్లాడుతున్న 4 పులి కూనలు, జాడ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న అటవీశాఖ అధికారులు

రెండు రోజులైనా తల్లి పులి (Tiger Cubs Searching for Mother) జాడ కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి.

Tiger cubs (Photo-Video Grab)

Nandyal, Mar 8: ఏపీలోని నంద్యాల జిల్లా కొత్తపల్లె మండలం పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పులి పిల్లలు (4 Tiger Cubs) దారి తప్పి జనావాసంలోకి వచ్చిన సంగతి విదితమే. రెండు రోజులైనా తల్లి పులి (Tiger Cubs Searching for Mother) జాడ కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. వాటిని తల్లి చెంతకు చేర్చేందుకు అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

వీడియో ఇదిగో, నంద్యాల అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన నాలుగు పులి పిల్లలు, సురక్షిత ప్రాంతానికి తరలించి అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు

పులి కూనలు లభ్యమైన ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వలయంలో 70 ఇన్‌ఫ్రారెడ్‌ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. తొలుత తల్లి పులిని గుర్తించి ఆపై ఆ ప్రాంతానికి పులి కూనలను చేర్చడం ద్వారా వాటిని తల్లితో కలపడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తల్లి పులిని గుర్తించిన తరువాత ఒక చిన్నపాటి ఎన్‌క్లోజర్‌లో పులి కూనలను అదే ప్రాంతంలో ఉంచుతారు. తల్లి వాటిని గుర్తించి దగ్గరగా వస్తే కూనలను ఎన్‌క్లోజర్‌ నుంచి వదులుతారు.ఈ లోపు పులి కూనలను ఎలా కాపాడుకోవాలనే మీమాంస అధికారుల్లో నెలకొంది.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Weather Forecast: నెల్లూరు జిల్లాకు అలర్ట్, బలహీనపడి అల్పపీడనంగా మారిన తీవ్ర అల్పపీడనం, ఏపీలో అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.