Bus Accident In Ap: లోయలో బడ్డ బస్సు, 8 మంది అక్కడికక్కడే మృతి, తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన, సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు
జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
East Godavari, October 15: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ బస్సు మారేడుమిల్లి నుంచి బయలుదేరి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు. మారేడుమిల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ శివరామకృష్ణ, పోలీసు బృందం సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన స్థలంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు.బస్సు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైనట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అయితే పై రోడ్డు నుంచి వెళ్తుండగా కింద రోడ్డుపై అదుపు తప్పి నడినట్లు చెబుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాక్సిడెంట్
మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డు ఎక్కువగా ఉంటుంది. లోయలో మధ్యలో కాస్త ఇరుకైన రోడ్డులో ప్రయాణించాలి. అందులోనూ టూరిస్ట్ స్పాట్ కావడంతో పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా టూరిస్ట్ బస్సులు ఈ ఘాట్ రోడ్డులోకి ఎక్కువగా వస్తుంటాయి. గతంలో కూడా రెండు, మూడుసార్లు ప్రమాదాలు జరిగాయి. తాజాగా మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతులందరూ కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. కర్ణాటకకకు చెందిన 26 మంది మొత్తం రెండు టెంపో ట్రావెలర్ లలో వీరందరూ నిన్న భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం బయల్దేరారు. రెండు టెంపోల్లో ఒకటి యాక్సిడెంట్ కు గురయినట్లుగా తెలుస్తోంది.