TDP MLA Atchannaidu: ఏసీబీ కస్టడీకి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో అయిదుగురు డైరక్టర్లు, మూడు రోజుల పాటు వీరిని విచారించనున్న ఏసీబీ

వీరిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం (ACB Court) బుధవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Tekkali TDP MLA Atchannaidu Arrest (Photo-Twitter)

Amaravati, June 25: ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం ( ESI scam) కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని (TDP MLA Atchannaidu) మరో అయిదుగురిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం (ACB Court) బుధవారం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను.. ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే... అర్ధరాత్రి 12 గంటల సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్‌ అధికారులు ప్రకటించారు. దీంతో ఆయనను తమ అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. రూ.150 కోట్ల ఈఎస్‌ఐ కుంభకోణం, టెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఏసీబీ, స్కాం వివరాలను వెల్లడించిన ఏసీబీ డైరెక్టర్‌ రవికుమార్‌

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కుంభకోణంలో అరెస్ట్‌ అయిన అచ్చెన్నాయుడు, రమేష్‌ కుమార్‌ను మూడు రోజుల పాటు, విజయ్‌కుమార్‌, జసదన్‌, చక్రవర్తి, వెంకట సుబ్బారావులను రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇన్‌ఛార్జ్‌ న్యాయమూర్తి వెంకటరమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న డైరెక్టర్లు రమేష్ కుమార్, విజయ్ కుమార్, వేణుగోపాల్, వెంకట సుబ్బారావు, మరో వ్యక్తిని పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో విజయవాడకు తరలించారు. టీడీపీకి మళ్లీ షాక్, పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించారని ఆరోపణలు

రెండు రోజుల విచారణ అనంతరం మళ్ళీ వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. అంతకుముందు ఏసీబీ హెడ్‌ క్వార్టర్స్‌లో ఏసీబీ డీజీతో అధికారులు భేటీ అయ్యారు. ఈఎస్‌ఐ స్కాంలో అరెస్టైన నిందితుల నుంచి రాబట్టాల్సిన అంశంపై చర్చలు జరిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif