Nellore Road Accident:గుడిలో నిద్ర చేయడానికి వెళ్తూ శాశ్వత నిద్రలోకి...నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం, వాగులో కొట్టుకుపోయిన ఆటో, ఐదుగురు గల్లంతు

సంగం సమీపంలోని బీరాపేరు(beeraperu) వాగులో ఆటో కొట్టుకుపోయిన ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురిని స్థానికులు కాపాడారు.

Road accident (image use for representational)

Nellore December 09: నెల్లూరు(Nellore) జిల్లాలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం(Accident) జరిగింది. సంగం సమీపంలోని బీరాపేరు(beeraperu) వాగులో ఆటో కొట్టుకుపోయిన ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. మరో ఏడుగురిని స్థానికులు కాపాడారు.

ఒకే కుటుంబానికి చెందిన 12 మంది ఆత్మ‌కూర్(Athmakur) వాసులు సంగంలోకి శివాల‌యంలో నిద్ర చేయ‌డానికి ఆటోలో బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్య‌లో బీరాపేరువాగుపై ఉన్న వంతెన దాటుతుండ‌గా ఎదురుగా వ‌చ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో వాగులో ఆటో ప‌డిపోయింది. పోలీసుల‌తోపాటు రోడ్డుపై వెళుతున్న వారు స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఏడుగురు వ్య‌క్తుల‌ను వాగులో నుంచి కాపాడారు. వారిలో బాలిక ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆత్మ‌కూర్ ప్ర‌భుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు.

Road Accident in Chittoor: తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తూ..ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 5 మందికి గాయాలు, అందరూ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే

ఇక గ‌ల్లంతైన ఐదుగురి కోసం గాలింపు చేప‌ట్టారు. రాత్రి కావ‌డంతో స‌హాయ చ‌ర్య‌ల‌కు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతున్న‌ది. స్థానికుల స‌హ‌కారంతో ఏడుగురిని కాపాడామ‌ని జిల్లా ఎస్పీ విజ‌యారావు తెలిపారు. గ‌ల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నామ‌న్నారు. వారి కోసం బోట్లు రప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు చెప్పారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif