IPL Auction 2025 Live

Adityanath Das: ఏపీ కొత్త సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్‌, పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మీ, ఈ నెల 30న బాధ్యతలు స్వీకరించనున్న దాస్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా విధులు నిర్వహించనున్న నీలం సాహ్ని

ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు (AP New CS Adityanath Das) చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (neelam sahani) పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

Adityanath Das and Srilaxmi (Photo-File Image)

Amaravati, Dec 22: ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం ఈ ఏడాదితో ముగియనుండటంతో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ (Adityanath Das) నియమితులయ్యారు. ఈనెల 31న సీఎస్‌గా ఆయన బాధ్యతలు (AP New CS Adityanath Das) చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (neelam sahani) పదవీ కాలం ఈనెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్‌ దాస్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన కార్యదర్శితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కార్యదర్శిగా శ్యామలరావు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వై.శ్రీలక్ష్మి పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె.సునీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వలు జారీచేసింది.

ఏపీకి కరోనావైరస్ సెకండ్ వేవ్‌ ముప్పు, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం వైయస్ జగన్, ఆస్పత్రుల్లో నాడు నేడుపై సమీక్ష జరిపిన ఏపీ ముఖ్యమంత్రి

దాస్ 1987 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆపీసర్..ఇంతకు ముందు ఆదిత్యనాథ్ దాస్ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అనేక ప్రాజెక్టులను ప్రారంభించారు. రాయలసీమలో అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో దాస్ పాత్ర ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేయడంలో కీలక పాత్రను పోషించారు.

జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు కూడా ఎదుర్కొన్నారు.

ఆయన స్వరాష్ట్రం బీహార్‌.. తల్లిదండ్రులు డాక్టర్‌ గౌరీ కాంత్‌ దాస్‌, కుసుం కుమారి.. 1987వ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన ఆదిత్యనాథ్ దాస్... బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్‌ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్‌ స్టడీస్‌(1984-86) చేశారు. గతంలో.. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్‌ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్‌, మున్సిపల్ పరిపాలన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు.. అయితే.. సీనియార్టీలో అజయ్‌ సాహ్ని, సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్‌ త్రిపాఠి, సతీష్‌ చంద్ర, జేఎస్వీ ప్రసాద్‌, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ లాంటివారున్నా.. ఆదిత్యనాథ్‌ దాస్‌ వైపే ప్రభుత్వం మొగ్గచూపారని టాక్. ఆదిత్యనాథ్‌ దాస్.. వచ్చే ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు.

ఇప్పటివరకు ఏపీ సీఎస్‌గా విధులు నిర్వరిస్తున్న నీలం సాహ్ని సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించిన సీఎం జగన్ ఆమెను సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమించారు. ఎల్వీ సుబ్రమణ్యం తరువాత ఏపీ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని విషయంలో మొదటి నుంచి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారు. ఆమె పదవీకాలం ముగిసినప్పటికీ.. కేంద్రానికి విజ్ఞప్తి చేసి రెండుసార్లు ఆమె పదవీ కాలాన్ని పొడిగింపజేసుకున్నారు. కొత్త జిల్లాల కమిటీని కూడా ఆమె సారథ్యంలోనే ఏర్పాటు చేశారు. తాజాగా ఆమె పదవీ కాలం ముగుస్తుండటంతో.. ఆమెను సీఎం జగన్ ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించారు..



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Constitution Day of India: 75వ రాజ్యాంగ దినోత్సవం, ప్రాథమిక హక్కులు- భారత పౌరులకు అందించిన గొప్ప వరం, ప్రజాస్వామ్యానికి మూలస్తంభంలా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ

RBI Governor Shaktikanta Das in Hospital: ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు