Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Dec 22: దేశంలోకి కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ (New Coronavirus Strain) ఎంటరయిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (Covid Second Wave Alert in AP) అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ వస్తోందన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సూచించారు. ఆస్పత్రుల్లో నాడు-నేడుపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించారు. కరోనా సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

ఇప్పటికే బ్రిటన్ సహా కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారని, రాష్ట్రంలో పరిస్థితులను కూడా జాగ్రత్తగా గమనిస్తుండాలని సూచించారు. ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న సౌకర్యాలను అధికారులు సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని తెలిపారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌పై మార్గదర్శకాలు విడుదల, యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ

దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, వ్యాక్సిను వాటి పనితీరుపై బ్రిటన్ వంటి దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యాక్సిన్ విషయంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కూడా వ్యాక్సిన్లను నిల్వ చేసే సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీకి ఇప్పుడున్న సదుపాయాలపై అధికారులు వివరాలు అందించారు. వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించిందని.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే అందరికీ వ్యాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, సిబ్బంది ప్రభుత్వానికి ఉన్నారని అధికారులు వెల్లడించారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రమాదకరమా..? కరోనావైరస్ 2.0 అసలు పేరేంటి? కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ఎప్పుడు..ఎక్కడ..ఎలా పుట్టింది? కోవిడ్ 2.0 గురించి పూర్తి సమాచారం

మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, డాక్టర్లు గ్రామాల్లోకి వచ్చి చికిత్స చేసేలా చూడాలని కూడా సీఎం పేర్కొన్నారు. వైద్యుడు ప్రతి నెల రెండుసార్లు నిర్దేశించిన గ్రామానికి వెళ్లాలని అన్నారు. గ్రామానికి వెళ్లే వైద్యుడి వెంట ఆరోగ్యమిత్ర, ఆశా కార్యకర్త ఉంటారని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైద్యుడు తన సేవలు అందించేందుకు విలేజ్ క్లినిక్ కూడా వేదికగా ఉంటుందని వివరించారు. ప్రతి మండలంలో కనీసం పీహెచ్ సీలు ఉండేలా చూడాలని, రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు.

యూకే నుంచి కొత్త కరోనా వైరస్, హైదరాబాద్‌కు బ్రిటన్ నుంచి ప్రయాణికులు, అప్రమత్తమైన తెలంగాణ సర్కారు, వారిని ట్రాక్ చేసే పనిలో బిజీ, యూకేకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్

వ్యాక్సిన్లు, అవి పనిచేస్తున్న తీరుపై బ్రిటన్‌ లాంటి దేశాల్లో పరిణామాలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వ్యాక్సిన్‌ను నిల్వచేసే స్థాయికి వెళ్లేలా ప్రయత్నాలు, ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. దీనికి ఎలాంటి మౌలిక వసతులు కావాలన్న దానిపై కూడా ఆలోచనలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

గ్రామాల్లోకి డాక్టర్లు వచ్చి వైద్యం చేసేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం రెండు పీహెచ్‌సీలు ఉండేలా చూడాలి. నెలకు రెండు సార్లు డాక్టర్‌ తనకు నిర్దేశించిన అదే గ్రామాలకు వెళ్లాలి. దీంతో గ్రామాల్లో ప్రజలకు, వారి ఆరోగ్య పరిస్థితుల మీద డాక్టర్‌కు అవగాహన ఏర్పడుతుంది. ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారన్నదానిపైన కూడా వైద్యుడికి అవగాహన వస్తుంది. వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశావర్కర్‌లు డాక్టర్‌తో ఉంటారు. 104 వాహనాల ద్వారా వారికి చికిత్స అందించడం సులభం అవుతుంది. హోం విజిట్స్‌ కూడా చేయాలి. అవసరం అనుకుంటే 104లనుకూడా పెంచుకోవాలని సీఎం కోరారు.