Adudam Andhra Closing Ceremony: మట్టిలోని మాణిక్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఆడుదాం ఆంధ్రా లక్ష్యం, ముగింపు వేడుకల్లో ప్రసంగించిన సీఎం జగన్
విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో (Adudam Andhra Closing Ceremony) సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.
Visakha, Feb 13: విశాఖలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు కార్యక్రమంలో (Adudam Andhra Closing Ceremony) సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు.ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఆడుదాం ఆంధ్రా పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) స్పష్టం చేశారు.
గ్రామ స్థాయి నుంచి ఎవరు కూడా ఎప్పుడూ ఊహించని పద్దతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. వారికి మనం సానబట్టగలితే సరైన శిక్షణ ఇవ్వగలితే మట్టిలో ఉన్న మాణిక్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమన్నారు.
ఈ రెండు ఉద్దేశాల్లో భాగంగానే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని అన్నారు. ఇందులో దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3లక్షల 30 వేల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని చెప్పారు.
లక్షా 24 వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే.. 7వేల 346 పోటీలు నియోజకవర్గ స్తాయిలో జరిగాయని పేర్కొన్నారు. 1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే.. 260 రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని ఈ రోజు ఫైనల్స్‌తో ముగించుకున్నామని సీఎం జగన్ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మన కోడి రామమూర్తిగారి గడ్డమీద ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం జగన్ అన్నారు. దాదాపు 37 కోట్ల రూపాయల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీరితోపాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ట్యాలెంట్ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు.
క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకు, ఇద్దరు చెల్లెమ్మలకు నలుగురిని గుర్తించాం. కబడ్డీ నుంచి ముగ్గురు మగపిల్లలు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు, ఒక చెల్లెమ్మ, ఖోఖో నుంచి ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. బ్యాడ్మింటన్ నుంచి కూడా ఒక తమ్ముడు, చెల్లెమ్మను గుర్తించాం. వీళ్లకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా అడుగులు వేయగలిగామని సీఎం తెలిపారు.
పవన్ (విజయనగరం), కేవీఎం విష్ణువర్ధిని (ఎన్టీఆర్ జిల్లా) చెల్లెమ్మ.. వీళ్లిదరినీ చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చేలా శ్రీకారం చుట్టారు.
శివ (అనపర్తికి), కుమారి గాయత్రి (కడప జిల్లా) చెల్లెమ్మను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. కబడ్డీకి సంబంధించి సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల), సుమన్ (తిరుపతి) ఈ ముగ్గురినీ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్‌ను, సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్ కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళలకు సంబంధించి మౌనిక (బాపట్ల) వీళ్లిద్దరినీ బ్లాక్ హాక్స్ సంస్థ దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)ని ఖోఖోలో తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్ ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల) వీళ్లిద్దరినీ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. వీళ్లందరికీ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. పైన పేర్కొన్న సంస్థలు కలిసి ఒక్కటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకుఅ డుగులు ముందుకు పడుతున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.