రాష్ట్ర రాజధాని మీద వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడా గడువు కూడా పూర్తి కావొస్తోంది. రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ముగిశాక సీఎం, వైసీపీ నాయకత్వం దీనిపై చర్చిస్తారని వెల్లడించారు. రాజధాని కట్టకుండా ఐదేళ్ల పాటు తాత్కాలికం పేరుతో టీడీపీ కాలయాపన చేసిందని విమర్శించారు.
Here's Video
విశాఖ రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి - వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి pic.twitter.com/lpGThU5Fm2
— Telugu Scribe (@TeluguScribe) February 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)