Andhra Pradesh Capital Row: మూడు రాజధానులకి పుల్‌స్టాప్ పెట్టిన చంద్రబాబు, ఏపీ రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు.
Amaravati, June 11: ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. నూటికి నూరు శాతం 3 పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు. ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదు. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది. ఏపీ మహిళలకు శుభవార్త.. ఉచిత బస్సు ప్రయాణంపై బాబు సర్కార్ ఫోకస్.. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న విధానాలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం అధ్యయనం.. చివరకు తెలంగాణ ‘ఫ్రీ బస్సు’ మోడల్ కు సై!
మీ అందరి సహకారంతో బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరం. రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. సంక్షోభంలో ఉంది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి.
రైతులు అప్పులపాలయ్యారు. పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలి. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం’ అని చంద్రబాబు వెల్లడించారు.