Three Capitals Row: అమరావతి రాజధాని కేసులో కీలక మలుపు, విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సుప్రీంకోర్టు CJI జస్టిస్‌ లలిత్, కేసు వేరే బెంచ్‌కు బదిలీ

లలిత్‌ తెలిపారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలోనే తన అభిప్రాయాన్ని ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chief Justice of India U.U. Lalit (Photo: PTI)

Amaravati, Nov 1: అమరావతి రాజధాని కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు. లలిత్‌ తెలిపారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలోనే తన అభిప్రాయాన్ని ఇచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసు (Amaravati capital case) విచారణ నుంచి కూడా వైదొలగుతున్నట్లు సీజేఐ జస్టిస్ యుయు లలిత్ తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది.

వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని సీజేఐ ( Supreme Court Chief Justice Justice U.U. Lalith) సూచించారు. గతంలో అమరావతిపై ఏపీ సీఎం జగన్‌ (AP CM Jagan)కు సీజేఐ లలిత్ ఇచ్చిన అభిప్రాయాన్ని... ధర్మాసనానికి రైతుల తరపు లాయర్ ఆర్యమ సుందరం అందజేశారు. అమరావతి కేసును విచారించబోనని లలిత్ స్పష్టం చేశారు. సీజేఐ విచారించినా అభ్యంతరం లేదని అమరావతి తరపు లాయర్లు పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో నేడు విచారణకు అమరావతి రాజధాని కేసు, హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరిన ఏపీ ప్రభుత్వం

జగన్‌కు ఇచ్చిన అభిప్రాయాన్ని సదుద్దేశంతోనే.. సీజేఐ దృష్టికి తీసుకొచ్చామని అమరావతి తరపు లాయర్లు వెల్లడించారు. అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు సీజేఐ ప్రకటించారు. తాను సభ్యుడిగా లేని బెంచ్‌కు కేసును పంపాలని రిజిస్ట్రీకి సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి తేదీని ప్రకటించాలని అమరావతి తరపు లాయర్లు కోరారు. వీలును బట్టి రిజిస్ట్రీ తేదీని ఖరారు చేస్తుందని సీజేఐ లలిత్‌ వెల్లడించారు.

ఈ రోజు విచారణ ప్రారంభం కాగానే గతంలో వివిధ అంశాల్లో సీఎం జగన్‌కు జస్టిస్‌ యు.యు.లలిత్‌ తన అభిప్రాయం ఇచ్చిన విషయాన్ని రైతుల తరఫు న్యాయవాది ఆర్యమ సుందరం ప్రస్తావించారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న సమయంలో అమరావతిపై జగన్‌కు అభిప్రాయం ఇచ్చిన విషయాన్ని సీజేఐకు గుర్తు చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ ‘‘అవునా.. ఆ విషయం నాకు తెలియదు. ఏ అభిప్రాయం ఇచ్చానో చెప్పగలరా" అని న్యాయవాదిని అడిగారు. గతంలో జగన్‌కు జస్టిస్‌ లలిత్‌ ఇచ్చిన అభిప్రాయం కాపీని ధర్మాసనానికి న్యాయవాది అందజేశారు.

ఆ కాపీని పరిశీలించిన సీజేఐ.. ఈ కేసును విచారించబోనని స్పష్టం చేశారు. విచారించినా తమకు అభ్యంతరమేమీ లేదని.. సదుద్దేశంతోనే జగన్‌కి ఇచ్చిన అభిప్రాయాన్నిధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినట్లు అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు చెప్పారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ‘‘అమరావతిపై అభిప్రాయం ఇచ్చానన్న విషయం నాకు తెలియదు.. మీరు నా దృష్టికి తీసుకొచ్చి మంచి పనిచేశారు" అని వ్యాఖ్యానించారు.

అనంతరం కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. పరిపాలనా సౌలభ్యం కోసం తాను సభ్యుడిగా లేని వేరే బెంచ్ ముందు విచారణకు పంపాలని రిజిస్ట్రీకి సూచించారు. తదుపరి తేదీని ప్రకటించాలని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా.. విచారణకే విముఖత చూపినపుడు తేదీ నిర్ణయించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వీలును బట్టి రిజిస్ట్రీ తేదీని ఖరారు చేస్తుందన్నారు.

.