Amplus Solar Investment in AP: ఏపీలో మరో రెండు కంపెనీలు రూ.1,750 కోట్ల పెట్టుబడులు, రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యాంప్లస్ సోలార్
యాంప్లస్ సోలార్ రూ. 1,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు భారీ పెట్టుబడులు రానున్నాయి. యాంప్లస్ సోలార్ రూ. 1,500 కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. 7.5 కేపీటీఏ (వార్షికంగా కిలో టన్నులు) సామర్థ్యంతో హరిత హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు యాంప్లస్ సోలార్ తెలిపింది.పారిశ్రామిక వినియోగ అవసరాల కోసం వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ ఎండీ, సీఈవో శరద్ పుంగాలియా వివరించారు. యాంప్లస్ పోర్ట్‌ఫోలియోలో 1.4 గిగావాట్ల సోలార్ అసెట్లు ఉన్నాయి.
దేశీయంగా అమ్మకాలు, ఎగుమతుల కోసం కడపలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎలిస్టా ఇండియా వెల్లడించింది. దీనిపై వచ్చే అయిదేళ్లలో దశలవారీగా రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ సీఎండీ సాకేత్ గౌరవ్ తెలిపారు. తొలుత రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు