Gas Penalty: రూ. 30 డిమాండ్.. ఇవ్వనందుకు సిలిండర్ తీసుకెళ్లిపోయిన డెలివరీ బాయ్.. రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం

ఇంటివరకూ గ్యాస్ తెచ్చినందుకు రూ. 30 అదనంగా ఇమ్మన్నాడు గ్యాస్ డెలివరీ బాయ్. వినియోగదారుడు ససేమిరా అనడంతో సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు. దీనిపై సదరు వినియోగదారుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. విచారించిన ఫోరం వినియోగదారుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Credits: Social Media

Anantapur, Jan 14: ఇంటివరకూ గ్యాస్ (Gas) తెచ్చినందుకు రూ. 30 అదనంగా ఇమ్మన్నాడు గ్యాస్ డెలివరీ బాయ్ (Delivery Boy). వినియోగదారుడు ససేమిరా అనడంతో  సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు. దీనిపై సదరు వినియోగదారుడు వినియోగదారుల ఫోరంను (Consumer Forum) ఆశ్రయించాడు. విచారించిన ఫోరం వినియోగదారుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అనంతపురంలో (Anantapur) జరిగిందీ ఘటన. బాధిత వినియోగదారుడికి స్థానిక గుత్తిరోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. 7 అక్టోబరు 2019లో రీఫిల్ సిలిండర్ బుక్ చేశాడు. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ అదనంగా రూ. 30 ఇవ్వాలని కోరాడు. అందుకు వినియోగదారుడు నిరాకరించడంతో తెచ్చిన సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు.

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే వీడియో, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి

దీంతో వినియోగదారుడు పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేయడంతో డెలివరీ బాయ్ తిరిగి సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంటిముందు పెట్టి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఘటనను ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లాడు. వారు పట్టించుకోలేదు.. సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని ఇవ్వాల్సిందేనంటూ డెలివరీ బాయ్‌ను సమర్థించారు. అంతేకాక, వినియోగదారుడిని ఆ తర్వాతి నెలలో మరో ఏజెన్సీకి బదిలీ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుడు ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

వందేభారత్ ట్రైన్‌ ప్రత్యేకతలు తెలుసా? సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే మార్గం, ఆగే స్టేషన్లు ఇవే! ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వందేభారత్‌

ఆ తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరాన్ని కూడా ఆశ్రయించారు. సిలిండర్‌ను సరైన సమయంలో డెలివరీ చేయకపోవడం వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన ఫోరం గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అయితే, డెలివరీ బాయ్‌ను తొలగించామని, కాబట్టి పరిహారం చెల్లించాల్సిన పనిలేదని ఏజెన్సీ వాదించింది. వాదనలు విన్న ఫోరం వినియోగదారుడికి జరిగిన నష్టానికి గాను పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Tesla Rent for Mumbai Showroom: ముంబైలో నెలకు రూ. 35 లక్షలకు పైగా అద్దెతో టెస్లా తొలి షోరూమ్‌ ఏర్పాటు, ఇంకా ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 శాతం అద్దె పెంపు..

Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు

Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Advertisement
Advertisement
Share Now
Advertisement