CM YS Jagan VC Highlights: రూ. 20 వేల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ, ఆగస్టు 16న విద్యా కానుక, ఆగస్టు 10న నేతన్న నేస్తం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలని, వీటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS jagan) అధికారులను ఆదేశించారు.
Amaravati, July 27: స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం వైయస్ జగన్ మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ (CM YS Jagan Mohan Reddy Video Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలని, వీటి సమర్థత మెరుగుపడాలంటే తనిఖీలు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS jagan) అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు (District Collectors), మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లు తనిఖీలు చేయాలన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవోలు 18 శాతం, సబ్‌కలెక్టర్లు 21 శాతం తనిఖీలు చేశారని, సరిగా తనిఖీలు చేయనివారికి మెమోలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు. తప్పులు జరిగితే వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని, కలెక్టర్లు, జేసీల స్థాయిలో పర్యవేక్షణ బాగుందన్నారు.
మిగిలిన అధికారులు కూడా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. 100 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పేదల గురించి ఆలోచించి మానవత్వం చూపించాలని సీఎం జగన్ అన్నారు. మీకు మెమోలు ఇవ్వడం అన్నది నాకు చాలా బాధ కలిగించే విషయమని చెప్పిన సీఎం నా పనితీరుమీద నేను మెమో ఇచ్చుకున్నట్టేనని అన్నారు.
వచ్చే స్పందన నాటికి నూరుశాతం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా అర్హులకు పథకాలు అందించాలన్నారు. రెండు శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో హాజరు గణనే ఉండట్లేదన్నారు. ఆగస్టు 10న నేతన్న నేస్తం, 16న విద్యాకానుక అందించనున్నట్టు సీఎం చెప్పారు. రూ.20వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న చెల్లింపులు చేయాలని ఆదేశించారు. డీబీటీ పథకాల్లో సోషల్ ఆడిట్ కోసం జాబితాను ప్రదర్శిస్తున్నారా? లేదా? చూడాలి. బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి.
నిర్దేశించుకున్న గడువులోగా అర్హులకు అందేలా చూడాలి. వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలి. ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యాకానుక అందజేస్తాం. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తాం. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని, ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పట్టణాభివృద్ది, పురపాలకశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.