Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం, అదుపుతప్పి జల్లేరు వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 8 మంది ప్రయాణికులు మృతి, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం

బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో (8 Killed in RTC Bus fell Into jalleru River) పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా... ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

RTC Bus fell Into jalleru River (Photo-Twitter/Video Grab)

Amaravati, Dec 15: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో (8 Killed in RTC Bus fell Into jalleru River) పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా... ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.

ఘటన జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. నీటిలో పడిన బస్సు బయటకు రాలేక ఎనిమిది మంది మరణించారని తెలుస్తోంది. బస్సు వేలేరుపాడు పేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు, పోలీసులు, సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif