AP Budget Session 2023: మార్చి 14 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు, అదే రోజు ఏపీ కేబినెట్‌ సమావేశం, అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం

ఈమేరకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్ జారీ చేశారు.మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు (Andhra Pradesh Assembly Budget Session) ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

File Image of Andhra Pradesh Assembly | ANI Photo

ఏపీలో అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఈనెల 14 నుంచి (AP Budget Session 2023) ప్రారంభకానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్ జారీ చేశారు.మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు (Andhra Pradesh Assembly Budget Session) ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

ఇక ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో మ.12 గంటలకు ఈ భేటీ ఉంటుంది. బడ్జెట్‌ సమావేశాలు పురస్కరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది.

విశాఖ నుంచే పరిపాలన, సమ్మిట్‌లో మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్, 6 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలపై కేబినెట్ భేటీలో స్పష్టత ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కీలకంగా మారనున్నాయి. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 28న విచారణ జరగనుంది. విచారణలో కోర్టు తీర్పు కనుక అనుకూలంగా వస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు