Balineni Meets CM Jagan: తాను ఎప్పుడూ పార్టీపై అలగలేదు, సీఎం జగన్‌తో భేటీ అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు, తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు

గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని .. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

Balineni Meets CM Jagan: తాను ఎప్పుడూ పార్టీపై అలగలేదు, సీఎం జగన్‌తో భేటీ అనంతరం బాలినేని కీలక వ్యాఖ్యలు, తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
YSRCP MLA Balineni Srinivasa Reddy (Photo-Twitter)

Balineni Srinivas Reddy Meets CM Jagan: సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని .. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తాను ఎప్పుడూ పార్టీపై అలగలేదని, పార్టీలోని కొందరు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను పార్టీ అధినేతను ఎప్పుడూ కలుస్తూనే ఉంటానని చెప్పారు. నియోజకవర్గంపై దృష్టి సారించాలని సీఎం తనకు సూచించినట్లు చెప్పారు. తాను అన్ని అంశాలపై జగన్ తో చర్చించానని, జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానన్నారు.

ఏపీలో వచ్చే 5 రోజులు ఎండలు అధికమవుతాయని హెచ్చరిక, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ప్రోటోకాల్ పెద్ద విషయం కాదని, దానిపై ఫిర్యాదు చేయడానికి ఏముంటుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవిపై చర్చ జరగలేదన్నారు. గతంలోనే తాను ఈ పదవికి రాజీనామా చేశానని, మంత్రి పదవిని వదులుకొని ప్రోటోకాల్‌పై ఫీల్ అయ్యేది ఏముంటుందన్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నా నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాటు జరుగుతున్నాయి. సీఎం జగన్‌తో భేటీ వల్ల సంతృప్తిగానే ఉన్నాను’’ అని బాలినేని వివరించారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: 63 లక్షల మంది మహిళలకు చీరల పంపిణీ, సెర్ఫ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేపట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు