AP Bus Accident: బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Rs 5 Lakh Ex-Gratia for Kin of Deceased) అందించాలని అధికారులను ఆదేశించారు
Amaravati, Dec 15: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి (Andhra Pradesh Bus Accident) బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొని జల్లేరు వాగులో బోల్తా (9 Killed as APSRTC Bus Plunges into Stream) పడింది. ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. జల్లేరు వాగులో బస్సు పడిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (Rs 5 Lakh Ex-Gratia for Kin of Deceased) అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లేరు వాగులో బస్సు బోల్తా ఘటనలో 9 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి ఆళ్ల నాని అదేశించారు. ఈ ప్రమాదంలో 20మందికి పైగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా అధికారులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ప్రమాద సమయంలో బస్సులో 47మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ, ఎమ్మెల్యే ఎలీజా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం బస్సు ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.