Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.
Vij, December 19: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు.
సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది. ట్రంక్ రోడ్లు, లే అవుట్ లలో మౌలిక వసతులు కల్పన, ఐకానిక్ బిల్టింగ్ లకు సంబంధించి అమోదం తెలపనుంది కేబినెట్.
అలాగే 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భవనం నిర్మాణం చేయనున్నారు. గతంలో విజయవాడ బుడమేరు ముంపుతో నష్టపోయిన బాధితులకు రుణాల రీ షెడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపు వంటి వాటిపై చర్చించనుంది కేబినెట్. వీడియో ఇదిగో, 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతా, ఎక్సైజ్ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ఐదు టవర్లకు రూ. 4,608 కోట్లు : 55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణానికి రూ.1048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఎడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని నిర్మాణం చేయనున్నారు. అన్ని టవర్లు కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నారు.
వివిధ పరిశ్రమలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అంశాలను మంత్రి వర్గంలో చర్చించనున్నారు. రాజధాని నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్ధకు మరో పది ఎకరాలు భూ కేటాయింపు ప్రతిపాదనకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.