AP Cabinet Meeting: కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌, మార్చి 27 నుంచి కడప నుంచి అదనంగా మూడు విమాన సర్వీసులు, మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై కేబినెట్‌ సంతాపం తెలిపింది. సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ap-capital-cabinet- (Photo-Facebook)

Amaravati, Mar 7: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై కేబినెట్‌ సంతాపం తెలిపింది. సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు (AP Cabinet Meeting) తీసుకుంది. ఈ నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం (crucial decisions approved ) తెలిపింది. కాగా అసెంబ్లీ సాక్షిగా తొలిరోజే టీడీపీ సభ్యులు నిరసనలకు తెరలేపారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగానికి అడ్డుపడ్డారు.

గవర్నర్‌ గోబ్యాక్‌ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో పాటు, గవర్నర్‌ ప్రసంగ పత్రులను చించివేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్‌ను దూషిస్తూ, ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి ఆయనపై విసిరేయడంపై బీఏసీ సమావేశంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. గవర్నర్‌ వయసులో పెద్దవారని, ఆయనకు గౌరవం ఇవ్వాలని సీఎం అన్నారు.

ఈ నెల 25 వ‌ర‌కు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, సభకు ఈ నెల 11న రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌, బీఏసీ సమావేశంలో టీడీపీపై మండిపడిన ఏపీ సీఎం వైఎస్ జగన్

మంత్రి మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు

1. స్టేట్‌ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం.

2. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్‌ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం

3. కర్నూలుకు చెందిన ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్, 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

4. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.

5. తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు.

6. డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టును జాయింట్‌ కంట్రోలర్‌(అడ్మిన్‌) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.

7. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్‌

8. రూ.1234 కోట్ల రూపాయిలతో మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం

9. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ

10. ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం.

11. బెంగుళూరు–కడప, విశాఖపట్నం–కడప నడుమ వారానికి మూడు విమాన సర్వీసులు, ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు. వీటికి అదనంగా కొత్త సర్వీసులకు ఆమోదం

12. మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం. ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్‌ ఒప్పందం.. కేబినెట్‌ ఆమోదం. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్ధతు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

13. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు –2 కింద చెరువులకు నీళ్లు. దీని కోసం బైపాస్‌ కాలువ నిర్మాణం.. రూ.214.85 కోట్ల ఖర్చు. ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

14 శ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌– బ్రిడ్జి నిర్మాణం. పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం

15. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్‌– బ్రిడ్జి– లాకుల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం

16. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం

17. ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

18. తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

19. ఆర్మ్‌డు రిజర్వ్‌ పోర్స్‌లో 17 ఆఫీసర్‌ లెవల్‌ ( 7 ఏఏస్పీ,10 డిఎస్పీ) కొత్త పోస్టులకు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

20. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

21. 165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం

22.ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

23. మొబైల్‌ ఆంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్‌ –2లో 165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now