Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వెల్లడి

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు

Chandrababu Naidu unveiled the 'Swarnandhra-2047' vision document

Vjy, Dec 12: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు. జగన్ హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని చెప్పారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు.

వైసీపీని వీడిన మరో కీలక నేత, పార్టీతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది. 2047 నాటికి 42 వేల డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యం. విజన్‌ డాక్యుమెంట్‌ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమన్నారు.

Chandrababu Naidu unveiled the 'Swarnandhra-2047' vision document

అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలి. ఆర్థిక అసమానతలను తగ్గించాలి. పీ4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. నాడు విజన్‌ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారు. విజన్‌ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలి.

ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. నైపుణ్య శిక్షణ ఇప్పించి.. మానవ వనరులను అభివృద్ధి చేస్తాం. నీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలనే కరవు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్‌లో చేర్చాం’’ అని చంద్రబాబు అన్నారు.



సంబంధిత వార్తలు