వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన ఘటన మరువక ముందే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించిన ఘనత గ్రంధి శ్రీనివాస్ కు ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ పై ఆయన విజయం సాధించారు. తద్వారా పార్టీలో జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.
Grandhi Srinivas Resigns to YSRCP
Avanti Srinivas and Grandhi Srinivas Resign from YSR Congress
The YSR Congress Party (YCP) saw two senior leaders, former minister Avanti Srinivas and former Bhimavaram MLA Grandhi Srinivas, resign today.
Avanti Srinivas Announces Resignation
Avanti Srinivas sent his… pic.twitter.com/fxyFq7M6Ll
— Sudhakar Udumula (@sudhakarudumula) December 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)