YSR EBC Nestham: వైఎస్సార్ ఈబీసి నేస్తం నిధులు విడుదల, 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

YS Jagan (Photo-Video Grab)

Markapuram, April 12: ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ బటన్‌నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ఆర్థిక సాయం వేశారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

కాగా మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుకే వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం.

ఏపీ విభజన కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, విచారణ జాబితాలో వాటిని చేర్చాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఆదేశాలు

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు (ఈబీసీ) ఏటా రూ.15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయంచేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది.

ఏపీలో కరోనా అలర్ట్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, కోవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలు

నేడు అందించిన రూ.658.60 కోట్లతో కలిపి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.1,257.04 కోట్లు. ఒక్కో అక్కచెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సాయం రూ.30,000. అలాగే, వివిధ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు గత 46 నెలల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ.2,25,991.94 కోట్లు (డీబీటీ మరియు నాన్‌ డీబీటీ కలిపి)

సీఎం జగన్ ప్రసంగం:

►ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం: సీఎం జగన్‌

►అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నాం

►చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు

►అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా

►అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమం

►అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం

►ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యం

►పేదరికానికి కులం, మతం ఉండదు

►మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం

►దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు

►రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ

►ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం

►46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం

►మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం

►మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం

►ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు

►ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు

►ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం

►అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు దిశ యాప్‌

►ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు ఉంటారు

►ఇలాంటి యాప్‌ దేశంలో ఎక్కడైనా ఉందా?

►మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశాం

►మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు