Cyclone Mandous: మాండూస్‌ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, తుపానుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష, ఈనెల 15వ తేదీన మరో అల్పపీడనం

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమీక్షకు సంబంధిత శాఖల అధికారులు హాజరు కానున్నారు.

Cyclone Mandous (Photo-Twitter/Video Grab)

VJY, Dec 12: మాండూస్‌ తుపాను, భారీ వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan) సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమీక్షకు సంబంధిత శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను (Cyclone Mandous) ప్రభావం మొదలుకాక ముందు నుంచి.. తుపాను మొదలయ్యాక ఆయన నిరంతరం తుపానుపై సమీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు అండగా నిలవాలని, అవసరమైతే పునరావాసాలపై దృష్టి సారించాలని ఆయన జిల్లా కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.

రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు

మాండూస్‌ తుపాను బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ఈ ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది.

ఏపీని అల్లకల్లోలం చేసిన మాండౌస్ తుపాను.. నేడు కూడా వర్షాలు.. అధికారుల అలర్ట్.. ఇప్పటికే వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు

కాగా మాండూస్‌ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండ­పో­తగా.. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్‌ జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడుతు­న్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత, భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లోని పట్ట­ణాలు, గ్రామాల్లో వర్షపు నీరు మోకాలి లోతున ప్రవ­హి­స్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి­పడ్డాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతు­న్నాయి.

ఈనెల 13వ తేదీన దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుంది. దీని ప్రభావంతో 15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. వీటి ఫలితంగా సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి వెల్లడించింది.