CM Chandrababu Slams YS Jagan: వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలెట్టారు, బీఏసీ సమావేశంలో మండిపడిన చంద్రబాబు, 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గౌవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు
Vjy, July 22: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గౌవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల అజెండాను బీఏసీ ఖరారు చేశారు. ఐదు రోజులపాటు సభను నిర్వహించాలని సభ్యులు నిర్ణయించారు. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన (Andhra Pradesh CM Chandrababu) ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశం జరిగింది.
అసెంబ్లీ కమిటీ హాల్‌లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం సాగింది. ఇందులో ఇసుక, శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే కఠినంగా శిక్షిద్దాం. వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలుపెట్టారు. వినుకొండ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు.. అప్పుడే విమర్శలా? గవర్నర్ ప్రసంగాన్ని తొలిరోజే అడ్డుకోవడం సరైన పనేనా? తప్పులు చేయడం.. పక్కవారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటు. వివేకా హత్య విషయంలో ఇతరుల పైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేశారు’’ అని వైఎస్ జగన్ మీద చంద్రబాబు (Chandrababu Slams YS Jagan Mohan Reddy) మండిపడ్డారు. మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం
ఇసుక జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామని.. దీనిపై మరిన్ని సూచనలు ఉంటే చెప్పాలన్నారు. డబ్బుల్లేవని పనులు ఆపలేమని.. ఇబ్బందులున్నా ముందుకెళ్లాలన్నారు. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని చెప్పారు. మూడు పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తొలిరోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ ప్రసంగం, వైసీపీ సభ్యులు వాకౌట్
గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనం. అర్థరాత్రి ప్రమాదం జరిగితే మర్నాడు వరకూ జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించలేదు. నిధులు లేవని పనులు చేయలేం అని చెప్పలేం. నిధుల విషయంలో ఇబ్బందులున్నా పనులు చేయాలి. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదాం" అని చెప్పారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)