CM Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో భేటీ అయిన సీఎం జగన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి చర్చ, రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం
ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా హస్తినకు చేరుకున్నారు. ఢిల్లీలో సీఎం జగన్‌కు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో రుసగా కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం నిధులు తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు.
శుక్రవారం(రేపు) ఉదయం విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరిగే సదస్సులో సీఎం పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. భేటీ సమయంలో జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి ఉన్నారు. నిర్మలా సీతారామన్‌కు జగన్ శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.