CM Jagan Delhi Tour Updates: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన హైలెట్స్ ఇవిగో, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రితో ముగిసిన భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు
Delhi, July 5: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజిబిజిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మోదీతో జగన్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీతో జగన్ దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం.
అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు సమాచారం. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ నిధులపై కూడా అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారని తెలుస్తోంది.
అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం, పోలవరం నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.