Andhra Pradesh: అర్హులై పథకాలు అందని 68,990 మంది ఖాతాల్లో రూ.97.76 కోట్లు జమచేసిన సీఎం జగన్, లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దని వెల్లడి
గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ (Andhra Pradesh CM Jagan Mohan Reddy) తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.
Vjy, Jan 5: గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ (Andhra Pradesh CM Jagan Mohan Reddy) తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని,. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.
లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుంది. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి నగదు జమ చేస్తున్నాం. 68, 990 మందికి ( released funds of Rs.97.76 crore for 68,990 eligible people) రూ. 97.76 కోట్లు విడుదల చేస్తున్నాం. పలు పథకాలు అందని వారికి లబ్ధి చేకూరుతుంది. ప్రతి 6 నెలలకోసారి ఈ నిధుల విడుదల కార్యక్రమం ఉంటుంది. గత 55 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2, 46, 551 కోట్లు అందించాం. ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వం లక్ష్యం. వలంటీర్లు స్వయంగా వెళ్లి లబ్ధిదారులతో దరఖాస్తులు పెట్టించాలి’ అని పేర్కొన్నారు.
సాంకేతిక కారణాలతో పథకాలు అందని వారిని తిరిగి మరో అవకాశం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో సంక్షేమ పథకాలు మిస్ అయిన వారికి మళ్లీ తిరిగి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎవ్వరూ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వలేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరేనంటూ లబ్ధిదారులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.
గతంలో దరఖాస్తు చేసుకుంటే సరిగ్గా రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఏదైనా కారణాలతో మిస్ సంక్షేమ పథకాలు మళ్లీ అమలు చేస్తున్నారని, అర్హత ఉంటే చాలు సిఫార్సు లేకుండానే సంక్షేమాన్ని ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.