Supreme Court of India (Photo Credit: ANI)

Vjy, Jan 3: సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ వాయిదా పడింది. అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా రాజధాని కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి విదితమే. విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీం.. ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం’’ అని పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం తెలిపింది.

27 మంది ఇంఛార్జులతో వైసీపీ రెండో జాబితా విడుదల...వారసులకు టిక్కెట్లు, ఎంపీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు..

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి విదితమే. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై పలుమార్లు వాదనలు జరిగాయి.

 27,61,000 మంది పిల్లలకు మేనమామగా రూ.11,900 కోట్లు ఇచ్చాం, జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్

ఈ క్రమంలో ఏపీ హైకోర్టు విధించిన కొన్ని గడువులపై జస్టిస్‌ కేఎల్‌ జోసెఫ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. అయితే అమరావతే రాజధాని అనే విషయంపై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా బుధవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది.

ఏపీ సర్కార్‌ పిటిషన్‌లో ముఖ్యంశాలు

►తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం

►రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది

►ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు

►రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, జీ ఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు

►రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోని కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి

►2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి

►అమరావతిలో రాజధాని నిర్మాణానికి 1,09,000 కోట్ల రూపాయలు అవసరం

►రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం 2000 కోట్ల రూపాయలతో పూర్తి

►రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు

►వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు

►రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం

►అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది. ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది