CM Jagan Mohan Reddy Action Plan: ఏపీలో జూన్‌ 12 నుంచి బడులు, అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం జగన్, విద్యాశాఖపై రివ్యూ హైలెట్స్ ఇవిగో..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.

YS Jagan (Photo-Twitter)

Vjy, June 8: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు తీరును, వాటి పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు.

ఆ టీడీపీ నేతలంతా గొట్టంగాళ్లు, ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు, టీడీపీలో తనకు ఎలాంటి పదవి లేదని వెల్లడి

ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో టాప్‌-10 ర్యాంకులను 64 మంది విద్యార్థులు సాధించారని అధికారులు తెలిపారు. స్కూళ్లలో పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ అమలు జరిగేలా బదిలీలు చేపడుతున్నామని, యూనిట్‌ టెస్టుట్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని తరహా ప్రభుత్వ కాలేజీలలో టాప్‌-10 ర్యాంకులను 27 మంది విద్యార్థులు సాధించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులతో ఏమన్నారంటే....

►ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కాలేజీలు ఉండేలా చూసుకోవాలి

►ఒకటి బాలికలకు, రెండోది కో–ఎడ్యుకేషన్‌ ఉండాలి

►జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైస్కూల్స్‌ను ఏర్పాటుచేసి వాటిని జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి.

►వచ్చే జూన్‌ నాటికి ఈ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటయ్యేలా చూడాలి

►నాడు – నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలి

►సరిపడా సిబ్బందిని అక్కడ నియమించాలి

►వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుక కార్యక్రమం.

►సీఎం ఆదేశాల మేరకు విద్యాకానుక నాణ్యత విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామన్న అధికారులు.

►నాణ్యత పాటించేలా క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు.

►ఇప్పటికే 93 శాతం విద్యాకానుక వస్తువులను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధంచేశారు.

►సీఎం ఆదేశాలమేరకు పుస్తకాలన్నింటినీ కూడా సిద్ధంచేశామన్న అధికారులు.

►రెండో సెమిస్టర్‌ పుస్తకాలు అన్నీకూడా ముందుగానే ఇచ్చేందుకు సిద్ధం చేశామన్న అధికారులు.

►మొదటి దశ నాడు–నేడు పూర్తిచేసుకున్న స్కూళ్లలో ఆరోతరగతి పైబడిన తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష.

►ప్యానెల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాలపై సీఎం ఆరా.

►ప్యానెల్స్‌ను ఎలా వినియోగించాలన్నదానిపై వీడియో కంటెంట్‌ టీచర్లకు పంపించాలన్న సీఎం.

►కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరిద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామన్న అధికారులు.

►మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20వేల మంది బీటెక్‌ స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్‌ చేస్తారని వెల్లడించిన అధికారులు.

►వీరు ప్రతినెలా వెళ్లి.. టీచర్లకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపిన అధికారులు.

►ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్‌ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్‌ యాప్‌పైనా టీచర్లకు శిక్షణ అందిస్తామన్న అధికారులు.

►రోజువారీగా, పాఠ్యాంశాలవారీగా బోధనపై స్కూళ్లకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు.

►అన్ని స్కూళ్లలో ఒకేలా బోధనకోసం ఇది ఉపయోగపడేలా తీర్చిదిద్దామన్న అధికారులు.

ట్యాబ్‌ల వినియోగంపై సమీక్షించిన సీఎం.

►ట్యాబ్‌ల నిర్వహణ, వినియోగంపై సీఎం ఆదేశాలమేరకు నిరంతరం సమీక్షలు చేస్తున్నామన్న అధికారులు.

►గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారన్న అధికారులు.

అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయంపై సీఎం సమీక్ష.

►సుమారు 45వేల స్కూళ్లలో ఇంటర్న్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు నిర్ణయం.

►ఏపీఎస్‌ఎఫ్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

►తొలిదశ నాడు నేడు పూర్తి చే సుకున్న స్కూళ్లలో ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందించే కార్యక్రమం పూర్తయిందన్న అధికారులు.

►సెప్టెంబరు నెలాఖరుకల్లా అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌ సదుపాయం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

►నాడు – నేడు రెండోదశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం.

►నాడు – నేడు రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన అధికారులు.

►22,224 స్కూళ్లలో రెండోదశ నాడు – నేడు పనులు.

►డిసెంబరు నాటికి పనులు పూర్తవుతాయన్న అధికారులు.

►నాడు–నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబులు పంపిణీతో పాటు, ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ ఏర్పాటు పూర్తికావాలన్న సీఎం.

►ప్రతి బాలుడు, బాలిక తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100శాతం జీఈఆర్‌ సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం ఆదేశాలు.

►డ్రాప్‌అవుట్స్‌ లేకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.

►డ్రాపౌట్స్‌ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల సహకారం తీసుకోనున్నట్టు తెలిపిన అధికారులు.

►పదోతరగతి, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు తిరిగి అడ్మిషన్‌ ఇచ్చి వారిని ముందుకు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.

►గోరుముద్ద, ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ల పై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకోవాలన్న సీఎం.

►ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్న సీఎం.

►థర్డ్‌పార్టీ వెరిఫికేషన్‌ ఉండాలన్న సీఎం

►ఇంటర్మీడియట్లో కూడా బైజూస్‌ కంటెంట్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

►తర్వాత దశలో ట్యాబులు పంపిణీకి కూడా సన్నద్ధంగా ఉండాలన్న సీఎం.

►దీనికోసం ఇప్పటినుంచే సరైన ప్రణాళికతో ముందుకు పోవాలన్న సీఎం.

►కేజీబీవీల్లో కూడా ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలన్న సీఎం.

►అకడమిక్‌ స్ట్రెంగ్త్‌ కోసం పనిచేయాలన్న సీఎం.

అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24 ను విడుదల చేసిన సీఎం

►జూన్‌ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు.

►ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించిన అధికారులు.

►2023లో టెన్త్, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులకు జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు.

►జగనన్న ఆణిముత్యాలు పేరుతో విద్యార్ధులకు ఇవ్వనున్న మెడల్స్‌ పరిశీలించిన సీఎం.

►స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌ 2023 లను అందించనున్న ప్రభుత్వం.

►మూడు దశలలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను సత్కారం.

►నియోజకవర్గ స్ధాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులను జూన్‌ 15న, జిల్లా స్ధాయిలో జూన్‌ 17, రాష్ట్ర స్ధాయిలో జూన్‌ 20న అవార్డులు ►అందజేయనున్న ప్రభుత్వం.

►రాష్ట్ర స్ధాయి అవార్డులు అందించనున్న ముఖ్యమంత్రి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now