Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, ముంపు బాధితులకు బాసటగా నిలవాలని అధికారులకు ఆదేశాలు, గోదావరి జిల్లాలకు రూ.12 కోట్ల అత్యవసర నిధులు

గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

YS Jagan (Photo-Twitter)

Tadepalli, July 28: రాష్ట్రంలోని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎంవో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతోపాటు, భారీవర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా ముఖ్యమంత్రి ఆరాతీశారు.

తీవ్ర వర్షాలు, వరదలతో ప్రభావితమైన గోదావరి జిల్లాలకు అత్యవసర సహాయక చర్యల కోసం రూ. 12 కోట్లు నిధులు మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అల్లూరి జిల్లా, కోనసీమ, ఏలూరు జిల్లాలకు 3 కోట్ల చొప్పున.. పశ్చిమ గోదావరికి రూ.2 కోట్లు.. తూర్పుగోదావరి కోటి.. మొత్తం 12 కోట్లు నిధులు మంజూరు చేసింది.

ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు

ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ పేరిట జీవో విడుదలయ్యింది. అత్యవసర సహాయక కేంద్రాల ఏర్పాటుకు, ముంపు గ్రామాల నుంచి ప్రజలను తరలించేందుకు, వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించేందుకు.. అలాగే హెల్త్ క్యాంపు నిర్వాహణతో పాటు శానిటేషన్ కోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు ప్రభుత్వం తరపున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

సీఎం జగన్ తో అధికారులు ఏమన్నారంటే..

42 మండలాల్లోని 458 గ్రామాలను అప్రమత్తం చేశామని సీఎం​​కు అధికారులు వివరించారు. సహాయచర్యల్లో 3 NDRF, 4 SDRF బృందాలు ఉన్నాయని తెలిపారు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్‌ రూమ్స్‌ పనిచేస్తున్నాయని, ముంపునకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో బోట్లు సహా సహాయక సిబ్బందిని సిద్ధంచేశామని అధికారులు తెలియ జేశారు. ఏలూరు జిల్లా కుకునూరు, వేలేరుపాడు సహా ఇతర మండలాల్లో ఇప్పటికే సహాయక శిబిరాలను తెరిచామని చెప్పారు.

చదవండి: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి అంబటి

ముంపు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించామని, మందులు సహా ఇతరత్రా అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచామని అధికారులు సీఎంకు వివరించారు. కోనసీమ జిల్లాలో 150 బోట్లను రెడీ ఉంచామన్న అధికారులు.. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని మూడు మండలాల్లో ముంపునకు ఆస్కారం ఉన్న గ్రామాల్లో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన వరద, 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన మోరంచపల్లి గ్రామం, రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్

అయితే సహాయక శిబిరాల్లో ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తాగునీరు సహా ఇతరత్రా సదుపాయాలు విషయంలో ఎక్కడా లోటు రాకూడదని అన్నారు. సహాయక చర్యల విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, ఆ మేరకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు కోసం ముందస్తుగా నిధులను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ పేర్కొన్నారు.