CM YS Jagan Kadapa Tour Updates: రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి, ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు, పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తామని తెలిపిన సీఎం జగన్

మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి వైఎస్‌ విజయమ్మ నివాళులర్పించారు.

CM YS Jagan Kadapa Tour (Photo-Video Grab)

Pulivendula, Dec 24: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో (CM YS Jagan Kadapa Tour) పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పులివెందులలో(Pulivendula) ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ (Jagannanna Colony) నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని సీఎం తెలిపారు.

జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందన్నారు. జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రామతీర్థం రగడ, అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు, ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సీనియర్ టీడీపీ నేత

నియోజక వర్గంలో ఆక్వాహబ్‌ సహా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పులివెందులలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పులివెందులలో రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు చెప్పారు. ప్రతి మండలానికి మర్కెటింగ్‌ గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

దీంతో పాటుగా పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్ లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పులివెందులకు మంచి కంపెనీ వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. రూ.110 కోట్లతో ఆదిత్య బిర్లా కంపెనీ టెక్స్ టైల్స్ పరిశ్రమ వస్తోందని తెలిపారు. ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఆదిత్య బిర్లా సంస్థ కూడా ఒకటని వివరించారు. పులివెందులలో ఆదిత్య బిర్లా కంపెనీ ఏర్పాటు ద్వారా తొలిదశలో 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సీఎం చెప్పారు